
ప్రపంచ పుస్తక దినోత్సవం
….
చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గార్డ్స్) స్వచ్ఛంద సేవాసంస్థ, జనవిజ్ఞానవేదిక మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ, సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం జరిగింది.. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. జనవిజ్ఞానవేదిక డివిజన్ కార్యదర్శి బొంత అజయ్ బాబు మాట్లాడుతూ పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ ప్రపంచ గతిని మార్చిన వారంతా పుస్తక పఠనం ద్వారానే మేధావులు అయ్యారన్నారు. అలాగే ప్రముఖ న్యాయవాది,దళిత చైతన్య స్రవంతి అధ్యక్షులు నల్లపు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం పఠనాసక్తి బాగా తగ్గిందన్నారు.
పిల్లలను పఠనాసక్తులుగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదన్నారు. పిల్లలను సెల్ పోను కు దూరంగా ఉంచి ప్రత్యామ్నాయంగా పుస్తకం ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా జనవిజ్ఞాన వేదిక ప్రచురించిన జీవనశైలి ఆరోగ్యసమస్యలు శాస్త్రీయ అవగాహన – పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులకు పుస్తకపఠనంపై పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. విద్యార్థులందరికీ మాజీ ఎమ్మెల్సీ కె .యస్. లక్ష్మణ్ రావు రూపొందించిన భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు, భారత రాజ్యాంగం నిర్మాణం పీఠిక పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గార్డ్స్ కార్యదర్శి పొనుగుబాటి బుల్లిబాబు, ఉపాధ్యక్షులు గేరా యాకోబు , జెవివి డివిజన్ అధ్యక్షులు ధూళిపాళ వెంకట్రావు, షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి అధ్యక్షులు సిద్ధాంతి కరిముల్లా రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షులు చెవుల సుబ్బారావు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి డా.దార్ల బుజ్జిబాబు, గార్డ్స్ సభ్యులు కుల్లి రాజా, వడ్లాన శరత్ చంద్ర, జెవివి ఉపాధ్యక్షులు టి.ప్రతాపరెడ్డి, గ్రంథాలయ ఇంచార్జ్ అధికారి డీ.వీర్రాజు, సిబ్బంది సరోజినీ, సాంబి రెడ్డి తదితరులున్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
