
ఓటర్ మ్యాపింగ్‌లో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం…..
అంతర్గాం తహసిల్దార్ కార్యాలయంపై ఆకస్మిక తనిఖీ, మే 30లోపు ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆదేశాలు….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి//గోదావరిఖని:
జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
అంతర్గాం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, కార్యాలయ పనితీరును సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు సమయానికి, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మొగల్ పహాడ్ గ్రామంలో ఎన్‌టీపీసీ భూ సేకరణ అంశానికి సంబంధించి రైతులు సమర్పించిన అభ్యంతరాలపై విచారణ వివరాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తూము రవీందర్ పాల్గొన్నారు.అనంతరం పెద్దపల్లి ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఓటరికి సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా సేకరించాలని, మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనవసరంగా ఓటర్ల తొలగింపులు చేయరాదని స్పష్టం చేస్తూ, ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను మే 30లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
