
చిలకలూరిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం
మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో శ్రీశైలానికి నేరుగా బస్సు సర్వీస్
చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవతో సరికొత్త బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారు.
మహిళా భక్తులకు వరం: స్త్రీ శక్తి’ పథకం అమలు
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, చిలకలూరిపేట నుండి శ్రీశైలానికి వెళ్లే ఈ ఎక్స్ప్రెస్ సర్వీసులో మహిళల కోసం ‘స్త్రీశక్తి’ పథకాన్ని వర్తింపజేయడం విశేషం. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణం పూర్తిగా ఉచితం. భక్తి మార్గంలో వెళ్లే మహిళా ప్రయాణీకులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. పురుషులకు (పెద్దలకు) టికెట్ ధర రూ. 345/- గా నిర్ణయించారు.
ప్రత్తిపాటి ప్రత్యేక దృష్టి – నేరుగా మల్లికార్జునుడి దర్శనానికి
గత ఎన్నో ఏళ్లుగా చిలకలూరిపేట నుండి శ్రీశైలానికి నేరుగా బస్సు సౌకర్యం లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఆర్టీసీ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి, డిపో నుండి నేరుగా శ్రీశైలం సర్వీసును ఏర్పాటు చేయించారు.
ఈ సర్వీసును ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
బస్సు వేళలు మరియు వివరాలు
చిలకలూరిపేట డిపో నుండి ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్ప్రెస్ సర్వీస్ కాలపట్టిక ప్రారంభోత్సవం ఉదయం 10:00 గంటలకు ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా
బయలుదేరు సమయం ప్రతిరోజూ ఉదయం 7:30 గంటలకు చిలకలూరిపేట నుండి.
శ్రీశైలం చేరు సమయం మధ్యాహ్నం 12:30 గంటలకు.
తిరుగు ప్రయాణం మధ్యాహ్నం *
2:15 గంటలకు శ్రీశైలం నుండి.
తిరిగి చేరు సమయం రాత్రి 7:15 గంటలకు చిలకలూరిపేటకు.
మహిళా ప్రయాణీకులు తమ గుర్తింపు కార్డును చూపి ‘శ్రీ శక్తి’ పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
