
చరిత్రలో నిలిచిపోయేలాజిల్లా లో మహానాడు
…కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద మహానాడు ఏర్పాట్లను ఎంపీ బీద మస్తాన్ రావుతో కలసి పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఏర్పాట్లను వివరించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి.అనంతరం వారు మాట్లాడుతూ ..మే 27, 28, 29 తేదీల్లో మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతోంది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది.ఇఫ్ కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో చాలా విశాలమైన స్థలంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.200 ఎకరాలు సభా ప్రాంగణానికి, మరో 300 ఎకరాలు వాహనాల పార్కింగ్ కు సిద్ధమవుతున్నాయి.
దశాబ్దాలుగా మహానాడుకు హాజరవుతున్నాం..నాంపల్లి గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు కార్యకర్తలతో కలిసి నడిచిపోయిన రోజులు ఇంకా గుర్తున్నాయి.నెల్లూరులో గతంలో అనేక సభలు నిర్వహించాం..మహిళా సదస్సు, సారా వ్యతిరేక ఉద్యమ సభతో పాటు అనేక ర్యాలీలు, సభలు విజయవంతంగా నిర్వహించాం తొలిసారిగా మహానాడు నిర్వహించే అవకాశం వచ్చింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు నాయకత్వంలో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతోంది.రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 13వ తేదీన మహానాడు ప్రాంగణంలో కమిటీలతో సమీక్ష నిర్వహించబోతున్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
