ఉపాధి హామీ కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి…

Spread the love

ఉపాధి హామీ కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి…

కూలీల సమస్యలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్తాం….

–మనాలి ఠాకూర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పాలకుర్తి, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి మనాలి ఠాకూర్ బుధవారం పాలకుర్తి మండలంలో ఉపాధి హామీ కూలీలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా కూలీలకు అందాల్సిన సౌకర్యాలు, పనుల పరిస్థితులు, వేతనాల చెల్లింపులు తదితర అంశాలపై వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎండలో కష్టపడి పనిచేస్తున్న కూలీల సమస్యలను శ్రద్ధగా విన్న మనాలి ఠాకూర్, వాటిని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిరంతరం పనిచేస్తున్నారని, ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలా కృషి కొనసాగుతుందని తెలిపారు.కూలీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొంటూ, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top