
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం
తిరుపతి: ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో సుమారు 70 నియోజకవర్గాలను ప్రభావితం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి తిరుపతికి విచ్చేశారు. గత ఆరు నెలలుగా పశ్చిమ బెంగాల్లో కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకంగా ఎన్నికల్లో వారికి దిశ నిర్దేశం చేసి ప్రతి కార్యకర్తను సైనికుడిలా తీర్చిదిద్ది బెంగాల్ ప్రభుత్వంలో బిజెపి జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించారు. తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంలో విచ్చేసి సందర్భంగా వారిని కలిసి అక్కడ జరిగిన విశేషాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బీజేపీ నాయకులు పొనగంటి భాస్కర్, గుండాల గోపినాథ్ రెడ్డి, వరప్రసాద్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
