
రజక సమాజ అభ్యున్నతికి కృషి చేయాలి….
తెలంగాణ రాష్ట్ర వాషర్‌మెన్ ఫెడరేషన్ చైర్మన్ దాసరి రాజు అజయ్ కుమార్‌కు ఘన సన్మానం…
రజకుల ఆత్మగౌరవ పరిరక్షణకు ఐక్యంగా పనిచేయాలని పిలుపు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్ర వాషర్‌మెన్ ఫెడరేషన్ రజక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన దాసరి రాజు అజయ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రజక సంఘ నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని చాకలి ఐలమ్మ విగ్రహ వ్యవస్థాపక నాయకులు, రాష్ట్ర రజక సంఘం పెద్దపల్లి జిల్లా వ్యవస్థాపకులు శ్రీ పాలడుగుల కనకయ్య పాల్గొని మాట్లాడుతూ, రజక సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రజకుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని చైర్మన్ దాసరి రాజు అజయ్ కుమార్‌ను అభినందించారు.
రజక సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. రజక యువత విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావడానికి ప్రత్యేక ప్రోత్సాహం అవసరమన్నారు.
చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దాసరి రాజు అజయ్ కుమార్ నాయకత్వంలో రజక సమాజానికి మరింత గుర్తింపు, అభివృద్ధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రజక సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
