
సింగరేణి రెస్క్యూ టీమ్‌కు అభినందనలు తెలిపిన ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, మే-14. సింగరేణి సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులను ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ అభినందించారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని ఎంసిఎల్ చాంపియన్ షిప్‌లో జరిగిన 5వ స్థాన పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన అండర్ గ్రౌండ్ విభాగం మెడట్ స్టేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడంలో రెస్క్యూ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గనుల రక్షణ విభాగంలో సింగరేణి సాధిస్తున్న విజయాలు సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతున్నాయని అన్నారు.
కార్యక్రమంలో ఏజీఎం ఇరిగేషన్ రామచంద్రరావు, డాక్టర్ రాజేశ్వర్ రావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
