
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన 3 రూపాయలు చొప్పున పెంచడాన్ని నిరసిస్తూ నేడు సిపిఐ కుత్బుల్లాపూర్ మండల సమితి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట కార్యాలయం నుండి ఆటో ట్రాలీని తాడుతో లాగుతూ నిరసన తెలియజేసి అనంతరం చివరి బస్ స్టాప్ వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేసు రత్నం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దురదృష్టి లేకపోవడం వల్లనే నేడు దేశంలో చమురు సంక్షోభం ఏర్పడిందని, గత పది సంవత్సరాల నుండి బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుండా పెట్రోల్ కంపెనీలు లాభాలు అర్జించి నేడు రెండు నెలలోనే నష్టాలు పేరుతో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం తుగ్లక్ చర్యని వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరడం జరిగింది.
అమెరికా, ట్రంప్ ఒత్తిడికి తలోగ్గి మోడీ రష్యా నుండి చమురు కనుగోలును తగ్గించడం వల్లే ఈ సమస్య ప్రధాన కారణమని, మోడీ తన స్నేహితుడైన ఆదానిని రక్షించడానికి దేశ విదేశాంగ విధానాన్ని, దౌత్య నీతిని ట్రంప్ కు దాసోహమై దేశ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చమరు బారెల్ ధర బిజెపి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ ఉండేదని కానీ బిజెపి ప్రజల కోసం చేస్తున్నానని చెప్పి పెట్రోల్ డీజిల్ ధరలను 100 రేట్లు పెంచడం వెనకాల మోడీ బిజెపి ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు తిరుగుబాటు చేయకుండా మతము, జై శ్రీరామ్ పేరుతో చేసే రాజకీయాలు ఎల్లప్పుడు పనిచేయవని అదే జైశ్రీరామ్ పేరుతోటి ప్రభుత్వం నష్టాలను భరించి ప్రజలను కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి స్వామి నాయకత్వం వహించగా మండల సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు కోశాధికారి సదానంద్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్, బాబు శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, శ్రీనివాస్ చారి నాయకులు గుర్రప్ప, శ్రీనివాస్, రవి, ముసలయ్య, ఇమామ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
