
అమావాస్య రోజు అన్నదానం… 35 నెలలుగా నిరంతర సేవ…
గాయత్రీ సేవా సమితి సేవలు అభినందనీయం : ప్రభుత్వ విప్ విజయరమణారావు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
ప్రతి నెల అమావాస్య సందర్భంగా గాయత్రీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం అభినందనీయమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.
పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద గాయత్రీ సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయరమణారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తూ 35వ నెల పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. దాతలుగా వ్యవహరించిన ఆవునూరి త్రివేణి – రవికుమార్ దంపతులు, కీ.శే. ఆవునూరి వెంకటేశం జ్ఞాపకార్థం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.
గత 34 నెలలుగా దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని గాయత్రీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాసనగొట్టు వినయ్ తెలిపారు. అనంతరం వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మజ్జిగ పంపిణీ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లన్న, కౌన్సిలర్లు మంథని నర్సింగ్, దొడ్డుపల్లి జగదీష్, సేవా సమితి ప్రధాన కార్యదర్శి రావికంటి రాజు, ఉపాధ్యక్షులు చిట్టి మల్ల రవిప్రసాద్, కోశాధికారి కటకం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నాగమల్ల శ్రీనివాస్, బొల్లం ఆంజనేయులు, సభ్యులు ముస్త్యాల ప్రదీప్, తొడుపునూరి వెంకటేశం, సంకీస ఆంజనేయులు, కముటాల గురుచరణం, నార్ల రమేష్, అల్లెంకి మారుతి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
