ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన చైర్ పర్సన్ మోర్ల సుప్రజ.

Spread the love

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన చైర్ పర్సన్ మోర్ల సుప్రజ.
నెల్లూరు జిల్లా గ్రీవెన్స్ డే సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెంమున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి ప్రజల నుంచి పలు ఫిర్యాదుల స్వీకరించారు. వివిధ సమస్యలతో ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి చైర్ పర్సన్ కి ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన దృష్టికి సమస్య వచ్చిన వెంటనే అధికారులను పురమాయించి వీలైనంత త్వరగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానన్నారు. గ్రీవెన్స్ డే ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

పట్టణంలో ఏ సమస్య వున్నా తన దృష్టికి తేవాలని తన వల్ల కాని పక్షంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ ఇనమల చిన బాబు, వైస్ చైర్మన్ ఎరుటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ కత్తి శ్రీదేవి ,పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top