
ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లు… పెన్ పహాడ్‌లో వైన్ షాప్‌ల దోపిడీ!
సూర్యపేట జిల్లా ప్రతినిధి: పెన్ పహాడ్ మండలంలోని మద్యం దుకాణాల్లో వినియోగదారులపై నిర్వాహకుల దోపిడీ కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. MRP కంటే ఎక్కువ ధరలకు కూల్‌డ్రింక్స్, ఫుడ్ వస్తువులు విక్రయిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఫుడ్ ప్యాకెట్లపై ముద్రించిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం సాధారణమైందని, ప్రశ్నిస్తే నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే స్పందించి అధిక ధరలు వసూలు చేస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
