
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి……..జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జ్ కళార్చన
వనపర్తి :
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కళార్చన అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమ్మర్ క్యాంప్ లోని విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి విద్యార్థులకు పోక్సో చట్టం, బాల్యవివాహాల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, మహానంది ఏ. ఎం. ఓ., పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, నిరీష ఆర్ట్ టీచర్, ప్రతాప్ రెడ్డి సి.ఎం.ఓ, మల్లేష్ స్కూల్ అసిస్టెంట్ మరియు బాల సదన్ ఇంచార్జ్ లావణ్య పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
