
అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలి…
గౌతమి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గౌతమి నగర్లో బుధవారం ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత మనిషిలో సానుకూల భావాలను పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సామరస్యం, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సమాజానికి నైతిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలను అందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ప్రజలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని సూచించారు.
విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
