
తెలుగు భాషా సంస్కృతులకు అపార సేవలందించిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి….ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి :
వనపర్తి నియోజకవర్గ మొట్టమొదటి ఎమ్మెల్యే, తెలుగు భాషా సంస్కృతులకు అపార సేవలందించిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు
సురవరం జయంతి సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ వారు సురవరం ప్రతాప్ రెడ్డి
చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పత్రిక సంపాదకుడు అయిన సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు
తెలంగాణ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మేధావిగా ఆయన పేరు చిరస్మరణీయం అని ఆయన పేర్కొన్నారు
తెలుగు భాష అభివృద్ధికి, సామాజిక చైతన్యానికి, ప్రజల్లో విజ్ఞాన వికాసానికి ఆయన చేసిన కృషి అపారమైందన్నారు
“గోల్కొండ పత్రిక” ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సామాజిక సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి ని ఆయన కీర్తించారు
తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో అందించి భవిష్యత్ తరాలకు అమూల్యమైన వారసత్వాన్ని అందించారన్నారు
సాహిత్యం, చరిత్ర, జర్నలిజం రంగాల్లో ఆయన చేసిన సేవలు నేటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని తెలిపారు
ప్రతి ఒక్కరం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు
కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిలి ఆదిత్య, వనపర్తి పట్టణ అధ్యక్షులు కదిరి రాములు, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మైనార్టీ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
