రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.

Spread the love

రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.

రైతు సమస్యలపై గలమెత్తిన వైసిపి నాయకులు

రాష్ట్రంలో బొగ్గుమన్న పెట్రోల్, డీజిల్, ధరలు రైతులు మీద పెను భారం

జిల్లా రైతాంగ సమస్యలపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనలతో జిల్లా రైతుల ఆధ్వర్యంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని రైతులు అనేక కష్టాలు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల రైతు ఏ స్థాయికి వెళ్ళిపోతారో రైతు పని ఆపేసి వేరే పనులు చూసుకోవలసిన పరిస్థితి

. పెట్రోల్, డీజిల్, ధరలు ఆకాశానికి పెంచేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయి పెను భారం రైతులు మీదే పడుతుంది. రైతు పొలాల్లో దిగినప్పటి నుంచి యంత్రాలతోనే పని. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆగ్రహాన్ని గురి కాకుండా ముందు చర్యల్లో భాగంగా వారికి కావలసిన సబ్సిడీలు అన్ని అందే విధంగా చూడాలి చూడని యెడల వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటుంది. రైతులకి, యువతకి, ప్రజలకి, ఎటువంటి సదుపాయాలు చేయకపోతే జిల్లా స్థాయిలోనే కాక, రాష్ట్రస్థాయిలో కూడా అందర్నీ కలుపుకొని ఉద్యమం చేసే విధంగా ముందుకు పోతామని తెలియపరిచారు. కరెంట్ బిల్లు కూటమి ప్రభుత్వం పెంచడం లేదని చెబుతున్న స్లాబ్ పై ప్రతి నెల పెంచుతూనే ఉన్నారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసరెడ్డి, కోవూరుమండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, యాక్టివిటీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి, జిల్లా ఇన్ లెక్చువల్ కార్యదర్శి తోడేటి మహేష్, జడ్పిటిసి కవనగిరి శీలత, హరి ప్రసాద్ రెడ్డి, విజయ్ సేనా రెడ్డి, అల్లం రాజా, గోడ మోషే, కవరగిరి ప్రసాద్, రైతు వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top