
గుడిబండలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమం….*పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసిందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా కోదాడ నియోజకవర్గంలోని గుడిబండ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం సర్పంచ్ మందుల నాగయ్యతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇర్ల జయసింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇర్ల నరసింహారెడ్డి, సీఎం శ్రీను, మాదాసి నాగరాజు, నర్సిరెడ్డి, వంశీ, కుక్కడపు సైదులు, సోమపంగు శ్రీను, గామయ్య, ఇస్సాకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
