టేకుమట్లలో ఘనంగా సౌడమ్మ తల్లి జాతర దిష్టిపూజ కార్యక్రమం

Spread the love

టేకుమట్లలో ఘనంగా సౌడమ్మ తల్లి జాతర దిష్టిపూజ కార్యక్రమం

సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ సౌడమ్మ తల్లి జాతర సందర్భంగా దిష్టిపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. గ్రామంలోని యాదవ కుల పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని భక్తి భావంతో ఆరాధించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ జాతరలో భాగంగా దిష్టిపూజ నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతున్నదని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో (ఆదివారం, మంగళవారం) ఈ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. టేకుమట్లతో పాటు పిన్నైపాలెం, పిల్లలమర్రి, రాయింగూడెం, బాలెంల, ఉప్పలపహాడ్, అనాజిపురం తదితర గ్రామాల యాదవులు భారీ సంఖ్యలో హాజరై జాతరలో పాల్గొననున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడ్ల వీరమల్లు, పలు గ్రామాల యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top