
సరస్వతి అంత్య పుష్కరాల్లో పవిత్ర స్నానం చేసిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ….
కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.
అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో పాటు భాజా భజంత్రీల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈఓ, వేద పండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “కాలేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు పవిత్రమైన అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది” అని తెలిపారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, “కాలేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పుష్కరాలు రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
