
తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన చారిత్రక రాష్ట్రం…
– ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా, దశాబ్దాల తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్వపరిపాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు, జిల్లా కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
