
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తాం….
–ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, . రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఆటో జేఏసీ సమావేశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాశిపేట రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రస్తుతం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలు, తగ్గుతున్న ఆదాయ అవకాశాలు ఆటో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆటో రంగానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఇంధన ధరలపై ఉపశమనం కల్పించాలని కోరారు.
అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆటో జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్.డి. బురహన్, ఉపాధ్యక్షులుగా ఎస్.కే. జబ్బర్, పాకా శంకర్, ప్రధాన కార్యదర్శిగా మడిపెద్ది రమేష్, కార్యదర్శులుగా ఎం.డి. ఆలీ, ఎగ్గడి రాజయ్య ఎన్నికయ్యారు.
సమావేశంలో ఆటో కార్మికులు, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
