
ప్రజల మన్ననలు పొందిన ఉద్యోగులకు హృదయపూర్వక వీడ్కోలు
సూర్యాపేట జిల్లా ప్రతినిధి
సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహరావు, ఏఈఓ స్వాతి బదిలీపై వెళ్తున్న సందర్భంగా టేకుమట్ల గ్రామంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గట్టు జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, యువకులు కలిసి ఎంతో గౌరవప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఉద్యోగరీత్యా బదిలీలు సహజమైనవేనని, గ్రామంలో పనిచేసే సమయంలో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. నరసింహరావు, స్వాతి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడంలో కృషి చేశారని, వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.
భవిష్యత్తులో కూడా వారు పనిచేసే ప్రతి ప్రాంతంలో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ గట్టు జ్యోతి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. గ్రామ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సమయానికి పరిష్కరించడం ద్వారా నరసింహరావు, స్వాతి మంచి పేరు సంపాదించారని అన్నారు. వారి బదిలీ గ్రామానికి కొంత లోటుగా భావిస్తున్నప్పటికీ, వారు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగులకు శాలువాలు కప్పి సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమం ఎంతో భావోద్వేగభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దుండిగల శివాజీ, ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ చింతమల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చింత కేశాలు, నీరుడు సురేష్, చేతరాజుపల్లి వీరేశ్, చింతమల్ల వేణు ప్రతాప్, గండమళ్ళ శిరీష-రాము, బొడ్డు జానకి-రాంబాబు, దాసరి శ్రీను, సూరరపు పూలమ్మ-వెంకన్న, కంపాటి రమేష్, దుర్గం యాదమ్మ, చింతలచేరి శ్రీనివాస్, కల్లేపల్లి మహేశ్వరి-పరశురాములు, ప్రముఖ ఆర్ఎంపి డాక్టర్ కుసుమ సిద్ధారెడ్డి, మాజీ వార్డు సభ్యులు, మల్టీపర్పస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
