ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష….

Spread the love

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష….

76.74 శాతం హాజరు నమోదు : జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తెలుగు పరీక్షకు మొత్తం 43 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 33 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ మేరకు 76.74 శాతం హాజరు నమోదు అయినట్లు తెలిపారు.

పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top