
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు – జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను డీఆర్ఓ స్వీకరించారు.
పెద్దపల్లి పట్టణం నల్ల పోచమ్మవాడకు చెందిన ఎం.డి. శాబాన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, సంబంధిత హౌసింగ్ ఈఈకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ సూచించారు.
గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన బి. శంకర్ తనకు దివ్యాంగుల కోసం ఫోల్డింగ్ వీల్‌చైర్ అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డీఆర్‌డీఓకు రాస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతర్గాం మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన రవికుమార్ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న వాచ్‌మన్ పోస్టు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, వారధి సొసైటీకి రాస్తూ పరిశీలించి సమస్య పరిష్కరించాలని సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
