
మియాపూర్ లో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన సందర్భంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్ ఎమ్మెల్యే ని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారుగా రూ. 2000 కోట్ల రూపాయల తో మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(CMC) ప్రధాన కార్యాలయం మరియు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వాగతం సుస్వాగతం.
నా తరుపున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేస్తున్నాను. అదేవిధంగా సభను విజయవంతం చేయడానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా అహర్నిశలు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు, తాజా మాజీ కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళ సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు , అనాధికారులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమంలో చంద్రకాంత్, గోపాల్, త్రిమూర్తి రాజు, లింగం, సుధాకర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
