
బీఎల్ఏ (BLA)ల అవగాహన మరియు శిక్షణ సదస్సులో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్…..
..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని కొంపల్లి ఎస్ఎన్ఆర్ గార్డెన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఎల్ఏ అవగాహన మరియు శిక్షణ సదస్సుకు స్థానిక మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్. ఈ బిఎల్ఎ శిక్షణ కార్యక్రమ ఇంచార్జ్ M.A ఫహీమ్ తో కలిసి పాల్గొన్నారు…
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ పార్టీ బలోపేతనికి, ఎన్నికల ప్రక్రియ సమర్థ నిర్వహణలో బూత్ స్థాయి ఏజెంట్ల (BLA) పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నాను. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చాను, ప్రతి బూత్ స్థాయి లో ఉన్నటువంటి ఏజెంట్లు సర్ ( SIR) కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని నకిలీ ఓటర్ల తొలగించే విధంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ బూత్ లెవెల్ ఆఫీసర్ తో కలిసి క్షేత్ర స్థాయి లో పనిచేయాలని పిలుపునిచ్చారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం లక్ష్యంగా పనిచేయాలన్నారు….
ఈ శిక్షణ సదస్సులో స్థానిక ఇన్చార్జ్ హనుమంత్ రెడ్డి మరియు కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు భూపతి రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , కిషోర్ రెడ్డి, మైపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,స్థానిక డివిజన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు…
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
