
వైసీపీ అంటే ప్రజలకు నమ్మకం
స్థానిక ఎన్నికల్లో ప్రతి చోటా పోటీ చేస్తాం..
కోవూరు నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులు
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గెలుపు తథ్యం..
చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్ని బూటకాలే..
మాజీ మంత్రి కాకాని, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న
రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గం డెల్టా ప్రాంతం చైతన్యవంతమైన నియోజకవర్గమని స్థానిక ఎన్నికల్లో ప్రతిచోట వైసిపి పోటీ చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రుక్మిణి కళ్యాణ మండపంలో వైసీపీ మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి బి ఎల్ ఎ, ఎస్ఐఆర్, సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వెన్ను పోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగాకోవూరు లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల టిడిపి వాళ్లను చూసి వైసిపి వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాలని నడ మంత్రపు సిరి ఆదేశాలు ఇచ్చిందన్నారు. కోవూరు నియోజకవర్గంలో అంతా సులువు కాదని, అప్పట్లో సుబ్బరామిరెడ్డి సైతం నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గముతోనైనా పెట్టుకోవచ్చు గానీ కోవూరు నియోజకవర్గ ప్రజలతో పెట్టుకోవద్దన్నారు. అలాంటి చైతన్యవంతులు కలిగిన ప్రజలు అన్ని గమనిస్తుంటారన్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోట వైసిపి పోటీలో ఉంటుందన్నారు. ప్రతి నాయకులు కార్యకర్తలు ఓటర్ల జాబితాను దగ్గరుండి నమోదు చేయించాలని సూచించారు. అనంతరం “మాజీ మంత్రి కాకాని” మాట్లాడుతూ.. చంద్రబాబు రెండేళ్లలో చేసింది అంతా మోసమేనన్నారు. నీది ఇవ్వలేకపోయానని ఒప్పుకొని దానిని పీ.ఫోర్ తో అనుసంధానించానని చెప్పడం సిగ్గు చెటన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పుట్ట శివశంకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, వైసిపి ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నిలపరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి, కొండూరు అనిల్ బాబు, తోడేటి మహేష్, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుణ్ణం జనార్ధన్, ఉదయ భాస్కర్, నియోజకవర్గ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
