ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ.

Spread the love

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

సంక్షేమం – అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం బలంగా ఉంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి, చెల్లాయపాళెం గ్రామాల్లో నిర్వహించిన “ప్రజలతో మాటామంతి” కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి వారి సమస్యలు తెలుసుకుని, అర్జీలు స్వీకరించాను.బీసీల సంక్షేమానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆదరణ 3.0 ద్వారా సంప్రదాయ వృత్తులకు పునర్వైభవం తీసుకువస్తూ, బీసీలను కూలీలుగా కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నాం.పెనుబల్లి గ్రామంలో ఇప్పటికే సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేశాం. ఇంకా మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top