
సూరారం డివిజన్లో తీవ్ర తాగునీటి సమస్య – వెంటనే రిష్కరించాలని మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ డిమాండ్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని న్యూ షాపూర్ నగర్, సూరారం ప్రాంతాల్లో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా సూరారం డివిజన్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి మంచినీరు అందకపోవడంతో మహిళలు, వృద్ధులు బిందెలతో రోడ్లపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిపై స్పందించిన మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ HMWSSB సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని కూడా అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
సూరారం డివిజన్ ప్రజలకు యుద్ధప్రాతిపదికన తాగునీటి సరఫరా పునరుద్ధరించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, జలమండలి అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిద్దిక్ , మధుమోహన్ శ్రీనివాస్ రెడ్డి అమీర్ ఖాన్ , సాజిద్ , హేమలత రెడ్డి , ముకుందరావు , సత్యనారాయణ , రవికుమార్ , లక్ష్మణ్ , ప్రశాంత్ , శ్రీనివాస్ రాజు , శివ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
