
తెలంగాణ ప్రభుత్వం మరియు C.M.Cఆధ్వర్యంలో నగరాన్ని పరిశుభ్రంగా, చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హెచ్.ఎం.టి హిల్స్ కాలనీలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి, ఏ.ఈ., డి.ఈ., శానిటేషన్ విభాగం అధికారులతో కలసి పాల్గొన్న హైదర్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .
ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నగర పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరియు C.M.C నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు,కాలనీవాసులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సూచించిన విధంగా తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు,అలాగే కాలనీలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ, ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
