సింగరేణి ఉద్యోగులకు బీమా ధీమా…

Spread the love

సింగరేణి ఉద్యోగులకు బీమా ధీమా….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి మరో ముందడుగు వేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగులకు భారీ బీమా రక్షణతో పాటు పలు ప్రత్యేక బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రమాద మరణం / శాశ్వత వైకల్యం సందర్భంలో రూ. 1 కోటి నుండి రూ. 1.50 కోట్ల వరకు బీమా రక్షణ,
సహజ మరణం సంభవించిన సందర్భంలో రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు బీమా సదుపాయం.ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో కీలక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొంది. ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి & ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మార్గదర్శకత్వంలో, సింగరేణి ఛైర్మన్ & ఎం.డి. డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, ఐఏఎస్ ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

కొత్తగూడెం హెడ్ ఆఫీసులో జనరల్ మేనేజర్ (పర్సనల్) – వెల్ఫేర్ & సీఎస్ఆర్ జి.వి. కిరణ్ కుమార్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ శ్రీ ఎ.వి. రమణమూర్తి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

జీఎం (పర్సనల్) ఐఆర్ & పీఎం కవితా నాయుడు, జీఎం (పర్సనల్) ఈఈ & ఆర్‌సీ ఏజేఎం మురళీధర్ రావు, జీఎం (ఎఫ్ & ఏ) ఎన్. చక్రవర్తి, డీజీఎంలు (పర్సనల్) కేసా నారాయణరావు, ముకుంద సత్యనారాయణ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ రీజియన్ హెడ్ ఐ. రాజ్‌కుమార్, చీఫ్ మేనేజర్లు అబ్దుల్ ఖాదర్ షేక్, బి. నరేందర్ రెడ్డి, కొత్తగూడెం బ్రాంచ్ హెడ్ జి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top