
డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలి
– ప్రధానోపాధ్యాయులు దరవత్ శోభాబాయి
మోతె : మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును కోల్పోవద్దని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దరవత్ శోభాబాయి విద్యార్థులకు సూచించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది లక్ష్మి, కామేశ్వరి, నందకిషోర్, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు పద్మ, పార్వతి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
