
గోదావరిఖని నుంచి కాకినాడకు నేరుగా ప్రయాణం, ప్రజలకు కొత్త వరం…!
గోదావరిఖని–కాకినాడ నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, ప్రజల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపర్చే దిశగా గోదావరిఖని నుండి కాకినాడకు నూతన ఆర్టీసీ బస్సు సేవను బుధవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఊపి ఆయన సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గోదావరిఖని, పరిసర ప్రాంతాల ప్రజలకు కాకినాడకు ప్రయాణించేందుకు ఈ కొత్త బస్సు సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ బస్సు సేవ ప్రారంభం ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. నూతన బస్సు సేవ ప్రారంభం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
