రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్

Spread the love

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్,

వనపర్తి :
పెబ్బేరు మండల పరిధిలో బస్సు బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల రాము పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top