
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి….
జులై 1న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలి…
సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి…
పెద్దపల్లి జిల్లా ప్రతినిథి పెద్దపల్లి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజున భారత కమ్యూనిస్టు పార్టీ పెద్దపల్లి మండల సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హులైన పేదలకు స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, అలాగే ఎలాంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని చెబుతూనే మరోవైపు వరంగల్లో ఇండ్లులేని పేదల గుడిసెలు వేసుకుంటే కాంగ్రెస్ వాటిని తొలగించడం దుర్మార్గమైన చర్య అని దీనిపైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జూలై 1న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని జిల్లాలోని ప్రజలందరూ కలెక్టరేట్ ముట్టడికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపలేని అసమర్థత ప్రధాని మోదీ అని, ప్రధాని మోది ట్రంప్ కు భయపడుతు న్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొందరు బిజెపి నాయకులు బెంగాల్ తరహా లోనే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడతామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని, తెలంగాణలో ఒక్క ఓటు కూడా పోకుండా ఎస్ఐఆర్ నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు.
త్వరలోనే కేంద్ర ప్రభుత్వంపై మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ వామపక్షాలు కలిసి పోరాటం చేస్తాయని ఆయన తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పెద్దపెల్లి మండల అధ్యక్షులు రమేష్ వినతి పత్రం అందించగా త్వరలోనే ఈ విషయమై మంత్రులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి సునీల్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య, పెద్దపల్లి మండల పట్టణ కార్యదర్శులు రమేష్, నవీన్, కల్లేపల్లి రవి, జింక విటల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బాలసాని లెనిన్, జిల్లా కార్యదర్శి రేణిగుంట్ల క్రితం తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
