
గంగా నగర్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
ప్రజల సుఖశాంతులు, లారీ కార్మికుల సంక్షేమం కోసం ప్రార్థన…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, గంగా నగర్‌లో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైసమ్మ కొలుపు కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. లారీ కార్మికులు, యజమానులు వ్యాపారాభివృద్ధి సాధించడంతో పాటు సురక్షితంగా తమ విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నారు.
అనంతరం లారీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, లారీ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
