నడిగూడెం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.,

Spread the love

నడిగూడెం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి., స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి… జు
కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో రూ. 20 కోట్లతో బరాఖత్ గూడెం నుండి కృష్ణనగర్, నడిగూడెం, మందడి నరసింహాలగూడెం కలుపుతు కాగితరామచంద్రాపురం వరకు 9.5 కి. మీ BT రోడ్డు కు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డితో కలసి రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను కలుపుతూ తారు రోడ్లు వేయించడం జరుగుతుందని, కోదాడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినదని కోదాడలో 26 కోట్లతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామని, కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో పేద ప్రజల కొరకు 2.5 కోట్లతో సిటీ స్కాన్ మిషన్, అలాగే కిడ్నీ రోగుల కొరకు డయాలసిస్ సెంటర్ ను అందుబాటులో తీసుకొచ్చామని, చిలుకూరులో 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, 50 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, రాబోవు రోజులలో కోదాడ నియోజకవర్గాన్ని అగ్రగామి నియోజకవర్గముగా నిలబెడతానని, కొత్తగా వేసిన తారు రోడ్లపై వ్యవసాయ పనులు నిమిత్తం ట్రాక్టర్లకు బిగించిన ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్ తిప్పరాదని ఇలా తిప్పడం వలన రోడ్లు తొందరగా పాడైపోతాయని కావున గ్రామ ప్రజలు రోడ్లను కలకాలం ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. అలాగే ఈ సంవత్సరం ఏలీనీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించినందున, రైతులు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వ్యవసాయ శాఖ వారు సూచించిన సూచనలు పాటించి నీరు తక్కువ అవసరం అగు ఆరుతడి పంటలు పండించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, ఆర్ అండ్ బి ఎస్సీ సీతారామయ్య, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, తాసిల్దార్ సర్పంచ్ చక్రం ఉమ, ఏఐసిసి మెంబర్ సర్వోత్తమ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top