
ఎ ఎస్ ఐ శివపార్వతి సేవలు అభినందనీయం
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు………….. సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులుపలుస శంకర్ గౌడ్
వనపర్తి
జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహించి ఎ ఎస్ ఐ గా ఉద్యోగ విరమణ చేసిన శ్రీమతి శివ పార్వతి సేవలు అభినందనీయమని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఎస్ సేవా సంస్థ కార్యాలయంలో నిర్వాహకులు శివపార్వతిని శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ సమాజ శాంతి భద్రతలలో పోలీసుల పాత్ర సమున్నతమైందని, ప్రజల ఆస్తులను కాపాడటంలో వారి విధి నిర్వహణ వెల కట్టలేనిదని పేర్కొన్నారు. సాధారణ హోం గార్డ్ గా ఉద్యోగ ప్రవేశం చేసి పదోన్నతులతో ఎ ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టి 38సంవత్సరాల పాటు ఉత్తమ సేవలందించి అందరి అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు.షి టీమ్ లో ఆమె పని తీరు ఎంతో మందికి స్పూర్తి నిచ్చిందని శంకర్ గౌడ్ చెప్పారు.
ఈకార్యక్రమంలో ఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్,కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్ర శేఖర్, బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు,రామ్ రెడ్డి,కవిత,శ్రీలక్ష్మి,ఎడ్విన్,గంధం రాజు,జ్యోతి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
