రావిపహాడ్‌లో కనకదుర్గమ్మ ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపన
మోతే:
మోతే మండలంలోని రావిపహాడ్ గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయ పునఃనిర్మాణ పనులకు గండ్రాతి కుశలవ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గండ్రాతి కుశలవ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన కనకదుర్గమ్మ ఆలయాన్ని మరింత అందంగా, భక్తులకు అనుకూలంగా పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కూడా యువకులు, పెద్దలు, రైతులు అందరూ సహకరించాలని ఈ నిరమణాన్ని కూడా కొన్ని నెలల లోనే పూర్తి చేస్తాం అని ఆయన అన్నారు .
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాకి సురేందర్ రెడ్డి ఎడ్ల పద్మారావు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
