
వనపర్తి నియోజకవర్గంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు 99.87 శాతం పంపిణీ పూర్తి
పూరించిన ఫారాలు తీసుకొని డిజిటలైజేషన్ చేసేందుకు ముమ్మర చర్యలు – అదనపు కలెక్టర్ రెవెన్యూ టి. వినోద్ కుమార్
వనపర్తి
వనపర్తి జిల్లాలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ టి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
సమీక్ష సందర్భంగా సి. ఈ. ఒ మాట్లాడుతూ జిల్లాలలో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కార్యక్రమం రేపటి లోగా పూర్తి కావాలని ఆదేశించారు. ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను సమగ్రంగా పూరించి వాటిని తిరిగి తీసుకొని డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ రెవెన్యూ టి. వినోద్ కుమార్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో 275,570 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 275214 ఫారాలు (99.87) శాతం బూత్ లెవల్ అధికారుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పూరించిన ఫారాలను తిరిగి తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటి వరకు17,411 దరఖాస్తులు డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఆన్లైన్ ద్వారా బూత్ లెవల్ ఆఫీసర్ల సహాయ నిమిత్తం 291 ఫోన్ కాల్ వచ్చాయని వాటిలో 222 మందితో బి.ఎల్. ఒ లు స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200 ఓటర్లకు మించకుండా, 2 కిలో మీటర్ల పరిధి దాటకుండా రేషనలైజేషన్ తయారు చేసే ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు తెలియజేశారు.
ఆర్డీఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఏలక్షన్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
