
సూరారం కాలనీలో యూజీడీ పైప్‌లైన్ విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కోరిన 292 వ డివిజన్ బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు వారాల వినోద్ కుమార్.
సూరారం కాలనీ ప్రధాన రహదారిలో 1వ ఓం జెండా నుండి 2వ ఓం జెండా వరకు గతంలో ఏర్పాటు చేసిన భూగర్భ మురుగునీటి (యూజీడీ) పైప్‌లైన్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో జనాభా గణనీయంగా పెరగడంతో సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ 292 వ డివిజన్ నాయకులు వారాల వినోద్ గతంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసి, పాత యూజీడీ పైప్‌లైన్‌ను ఆధునికీకరించి, పెద్ద సామర్థ్యం గల పైప్‌లైన్‌తో విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల సమస్యను వెంటనే గుర్తించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జనరల్ మేనేజర్ శ్రీమతి మాధవి ని ఈ పనులను అత్యంత ప్రాధాన్యతతో త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ 292 వ డివిజన్ నాయకులు వారాల వినోద్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎం శ్రీమతి మాధవి ని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ప్రతిపాదన లేఖను అందజేశారు. సూరారం కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వివరించి, యూజీడీ పైప్‌లైన్ విస్తరణ పనులకు అవసరమైన చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారాల వినోద్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ప్రత్యేక చొరవతో ఈ పనులు త్వరలోనే ప్రారంభమై పూర్తవుతాయని, తద్వారా సూరారం కాలనీ ప్రజలకు దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాల్గొన్నారు రాజ్ కుమార్ ముదిరాజ్ కావలి రవి జైశ్రీరామ్ నగర్ ప్రెసిడెంట్ వేణు ముదిరాజ్ అనిల్ కిషోర్.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
