
నగర సౌందర్యానికి ప్రాధాన్యం…
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఆధునిక ఐలాండ్ నిర్మాణానికి అధికారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనలు….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి. రామగుండం, రామగుండం నియోజకవర్గాన్ని మరింత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ రామగుండంలోని ఎ-పవర్ హౌస్ సర్కిల్ వద్ద ప్రతిపాదిత ఐలాండ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్కిల్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆధునిక నమూనాలో ఐలాండ్‌ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగర సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు రహదారి భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా పనులు చేపట్టాలని పేర్కొన్నారు.
రామగుండం అభివృద్ధిలో భాగంగా సుందరీకరణ పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
