
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజీవ్ గాంధీ నగర్ నూతన కమిటీ సభ్యులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అజయ్ కుమార్ , స్థానిక మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అజయ్ కుమార్ గారు రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు స్పందించిన కూన శ్రీశైలం గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ నగర్ కమిటీ సభ్యులు సంపత్ రెడ్డి, అశోక్, వేణుగోపాల్, మహిపాల్ రెడ్డి, వెంకటేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
