జూలై 16 నుంచి 28 వరకు గొర్రెలు, మేకలకు పీపీఆర్ నివారణ టీకాలు

Spread the love

జూలై 16 నుంచి 28 వరకు గొర్రెలు, మేకలకు పీపీఆర్ నివారణ టీకాలు

ఉమ్మడి నల్గొండ జిల్లా

సూర్యాపేట మండలంలోని అన్ని గ్రామాల గొర్రెలు, మేకల పెంపకదారులు పీపీఆర్ (చీడపారుడు) వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి డా. వేణుగోపాలరావు కోరారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పీపీఆర్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రెండు నెలల నుంచి 12 నెలల వయస్సు గల గొర్రెలు, మేకలకు మాత్రమే ఉచితంగా టీకాలు వేయబడతాయి. గొర్రెలు, మేకలలో ప్రాణాంతకంగా మారే పీపీఆర్ (చీడపారుడు) వ్యాధిని నివారించేందుకు ఈ టీకాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు. కాబట్టి అర్హత కలిగిన ప్రతి జీవికి తప్పనిసరిగా టీకాలు వేయించి, పశుసంపదను వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని పశుపోషకులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలకు వచ్చే పశువైద్య బృందాలకు సహకరించి, నిర్ణీత తేదీల్లో టీకాలు వేయించుకోవాలని మండల పశువైద్యాధికారి డా. వేణుగోపాలరావు సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top