గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన జడ్పీ సీఈఓ శిరీష..

Spread the love

గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన జడ్పీ సీఈఓ శిరీష..

కోదాడ: కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామపంచాయతీలో జడ్పీ సీఈవో శిరీష గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించినారు. అనంతరం గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కు సంబంధించిన వివిధ శాఖల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ పై బిఎల్ఓ లను ఆన్లైన్ వివరాలను సరైన వివరాలతో చేయగలరని సూచించారు. గ్రామపంచాయతీ నర్సరీ పరిశీలించి వన మహోత్సవంలో ప్లాంటేషన్, చెరువు గట్టుపై చెట్లను నాటాలని చెప్పినారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్, గ్రామ సర్పంచి పాలకి సురేష్, ఎంపిఓ రాంబాబు, ఏపీవో టానియ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, బిఎల్ వో లు కృష్ణవేణి, అరుణ, ఆదిలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్, సైదులు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top