
బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మిద్దాం……..జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ కళార్చన
వనపర్తి
బాల్య వివాహాల రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి అన్నారు. జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో మానజిపేట గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు . ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ బాల్యవివాహాలకు సహకరించిన మరియు వివాహానికి హాజరైన చట్ట ప్రకారం శిక్ష అర్హులు అవుతారని తెలియజేశారు.
అదేవిధంగా బాల బాలికలకు, వయోవృద్ధులకు, బడుగు బలహీన వర్గాలకు మరియు మహిళలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని తెలియజేశారు. మరియు బాల్య వివాహాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టం మరియు డ్రగ్ అబ్యూస్ గురించి తెలియజేశారు. అదేవిధంగా నాల్సా వారు చట్టాలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రజలతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ టీ కార్తీక్ రెడ్డి, 1st అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అశ్విని, లాడ్స్ కౌన్సిల్స్ బాలయ్య, కృష్ణయ్య, శ్రీదేవి, రఘు, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, గ్రామ సర్పంచ్ శ్రీలత, విశ్వనాథం, సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
