భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Spread the love

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఉమ్మడి నల్గొండ జిల్లా

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ సంస్థ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిసిడబ్ల్యు యు జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, జిల్లా అద్యక్షులు అనంతుల‌ మల్లయ్య మాట్లాడుతూ సిసిఎస్ ద్వారా అమలు చేస్తున్న ఆరోగ్య పరీక్షలు రద్దుచేసి కార్మికులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు‌.

ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో నెంబర్ 12 రద్దుచేసి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ లు రద్దు చేయాలని అన్నారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న పెండింగ్ క్లెయిమ్స్ కు వెంటనే నిధులు మంజూరు చేయాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ నెలకు 6000/- రూపాయలు పిల్లల చదువుకు స్కాలర్ షిప్ లు, గృహవసతి, అడ్డాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నెమ్మది వెంకటేశ్వర్లు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top