
అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామిని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
గోదావరిఖని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి అస్వస్థతకు గురై స్థానిక మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు సోమవారం ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి , జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ , టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, జెవి రాజు, పోలాడి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్ మేకల సమ్మన్న, నిమ్మరాజుల రజని రవి తదితరులు ఆస్పత్రికి చేరుకుని గుమ్మడి కుమారస్వామి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే నాయకులు నారాయణదాసు మారుతి, కోదాటి ప్రవీణ్, మద్దికుంట శంకర్, మాడిశెట్టి రవి, గౌస్ బాబా, జరుపుల శ్రీనివాస్, చింతకింది సంపత్, పున్నం శశికుమార్, నామతాబాద్ కిరణ్, మేకల శ్రీనివాస్, శాడవేన రాజు, సాయి చింటూ, శ్రీకాంత్, గడపురం కళ్యాణ్ తదితరులు కూడా పరామర్శలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుమ్మడి కుమారస్వామి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, ఆయన త్వరితగతిన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
