
మంథని సీహెచ్‌సీలో 24 గంటల ప్రసూతి, చిన్నపిల్లల వైద్య సేవలు…
–సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ పిలుపు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇటీవల చేపట్టిన వైద్యుల నియామకాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కు ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ తెలిపారు.
నియమితులైన వైద్యుల్లో డా. మామిడిపల్లి స్రవంతి గైనకాలజిస్టుగా, డా. గుంట మౌనిక అనస్తీషియా స్పెషలిస్టుగా, డా. నరేష్ పీడియాట్రిషన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ నియామకాలతో ఇకపై మంథని సీహెచ్‌సీలో 24 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రసూతి సేవలు, చిన్నపిల్లల వైద్య సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
మంథని, పరిసర ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న నాణ్యమైన, ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ కోరారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
