నాగేశ్వర్ గాలిపల్లికి ‘మనో మార్గదర్శక్ ఉత్తమ సైకాలజిస్ట్’ అవార్డు….

Spread the love

నాగేశ్వర్ గాలిపల్లికి ‘మనో మార్గదర్శక్ ఉత్తమ సైకాలజిస్ట్’ అవార్డు….

డ్రగ్స్, మద్యం వ్యసన నిర్మూలనకు ‘స్పార్క్’ కౌన్సిలింగ్ కార్యక్రమం ద్వారా విశేష సేవలు….

జాతీయ సైకాలజిస్టుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి గుర్తింపు….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: కరీంనగర్, మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిసై జీవితాలను కోల్పోతున్న యువతలో చైతన్యం నింపుతూ, స్పిరిచువల్ కౌన్సిలింగ్ సైకాలజీ ఆధారంగా రూపొందించిన ‘స్పార్క్’ కార్యక్రమం ద్వారా విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సైకాలజిస్టు, ఐఆర్‌సీఏ ప్రాజెక్టు సమన్వయకర్త డి.జి. నాగేశ్వర్ గాలిపల్లికి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక ‘మనో మార్గదర్శక్ ఉత్తమ సైకాలజిస్ట్’ అవార్డు లభించింది.

జాతీయ సైకాలజిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లో అడ్వాన్స్డ్ సైకాలజికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లయన్స్ ఇంటర్నేషనల్ ఆల్ ఈజ్ వెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.

వ్యసనాల బారిన పడిన యువతకు కౌన్సిలింగ్ ద్వారా నూతన జీవితాన్ని అందించేందుకు నాగేశ్వర్ గాలిపల్లి చేస్తున్న కృషికి ఈ పురస్కారం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లా నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పట్ల సైకియాట్రిస్ట్ డా. పురుషోత్తం, సర్జన్ డా. ఎలగందుల శ్రీనివాస్, కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, ఆలయన్స్ జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్ తదితరులు నాగేశ్వర్ గాలిపల్లిని అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top